
లోతట్టు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్
● భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు
జాగ్రత్తలు సూచించిన అగ్నిమాపక శాఖ
ఖలీల్‌వాడి: భారీ వర్షాల సూచన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ రోడ్డులోని లోతట్టు ప్రాంతాలు, కెనాల్ ప్రాంతంలో అగ్నిమాపకశాఖ అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలకు నీ రు ఇళ్లలోకి వచ్చి చేరితే, రక్షణ చర్యలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఇళ్లలోకి నీరు వస్తే వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు అగ్నిమాపకశాఖ అధికారి శంకర్ సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.
పారిశుద్ధ్య పనుల పరిశీలన
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం డిప్యూటీ కమిషనర్ రవిబాబు పరిశీలించారు. మహాలక్ష్మినగర్, బ్యాంక్‌కాలనీ, నాందేవ్‌వాడ, ముజాహిద్‌నగర్ కాలనీల్లో శానిటరీ సూపర్‌వైజర్‌తో కలిసి ఆయన పర్యటించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. సూపర్‌వైజర్, ఇన్స్‌పెక్టర్లు శ్రీకాంత్, సునీల్ తదితరులున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్