
సంక్షిప్తం
బడిలో కృష్ణాష్టమి వేడుకలు
మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలోగల జ్ఞానోదయ హైస్కూల్‌లో గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టి సంబురాలు చేసుకున్నారు. ప్రిన్సిపాల్ దేవ శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దుర్గామాతను దర్శించుకున్న జిల్లా నాయకులు
నిజామాబాద్ సిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఆర్మూర్ ఏబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీకి ఎంపిక
నిజామాబాద్‌నాగారం: చైన్నెలో ఈ నెల 18 నుంచి జరిగే బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అనికేత్‌రెడ్డి ఎంపికయ్యారు. ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జస్టీస్ నవీన్‌రావు, జాయింట్ సెక్రటరీ బస్వరాజు కలిసి 15మందితో కూడిన జట్టును ఎంపిక చేసి ప్రకటించారు. అనికేత్‌రెడ్డిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కోచ్ సురేష్ అభినందించారు.
ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి
నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని కోజాకాలనీలోగల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖైసర్ కోరారు. ఈమేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అప్పటి నగర మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంక్షిప్తం

సంక్షిప్తం

సంక్షిప్తం