
జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి
ఎంపీకి సాధన కమిటీ సభ్యుల వినతి
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్‌ను పారిశ్రామికీకరణ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, వారిని ఆర్థికంగా శక్తివంతం చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. కాగా, డ్రైపోర్టు ఏర్పాటు విషయంలో వీలైనంత త్వరగా ఫిజిబిలిటీ రీసెర్చ్ చేయిస్తానని ఎంపీ హామీనిచ్చినట్లు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు ఎన్ దినేశ్ రెడ్డి, హితేన్, లక్ష్మణ్, బీజేపీ నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, తదితరులు ఉన్నారు.