
సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో మెలకువలు నేర్చుకోవాలి
జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి
నిజామాబాద్ లీగల్: యువ న్యాయవాదులు సివిల్ ప్రొసీజర్ కోడ్‌పై పట్టు సాధించినప్పుడే సివిల్ లా యర్‌గా వృత్తిలో స్థిరపడతారని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. యువ న్యాయవాదుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన శిబిరం రెండోరోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ న్యాయవాది సంగమేశ్వర్ రావు సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ సెక్షన్లపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ అడ్వకేట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయస్పూర్తితో ఆలోచిస్తే అనేక సమస్యలకు న్యాయశాస్త్రంలో పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, వాల్గోట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.