కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల

Aug 14 2025 6:48 AM | Updated on Aug 14 2025 6:48 AM

కాకతీ

కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. కాకతీయ కాలువకు 2500, లక్ష్మి కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. అలీసాగర్‌, గుత్ప లిఫ్ట్‌ ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 482 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1080.10(45.16టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజానికి

కృషి చేయాలి

ఖలీల్‌వాడి: నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ఐదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ రీజియన్‌ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్‌ రహిత జీవన శైలి పాటించడం, అక్రమ రవాణా నిరోధించాలన్నారు. బస్సులో గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాత్రంతా విధుల్లోనే..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాకు భారీ వర్ష సూ చన నేపథ్యంలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్‌ మండల అధికారులు బుధవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. త హసీల్దార్‌ నరేశ్‌ కుమార్‌తో కలిసి ఎంపీడీవో లక్ష్మి ప్రసాద్‌, మండల వ్యవసాయ అధికారి మ ధుసూదన్‌, రెవెన్యూ సిబ్బంది తహసీల్‌ కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించా రు. ఆయా గ్రామాల ప్రజలతో ఫోన్‌లో మా ట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని హస్గుల్‌ క్వారీ నుంచి మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సముందర్‌ తండా శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌ కుమార్‌ తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అరుణ్‌ కుమార్‌ హెచ్చరించారు.

కాకతీయ కాలువకు  తగ్గిన నీటి విడుదల 1
1/2

కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల

కాకతీయ కాలువకు  తగ్గిన నీటి విడుదల 2
2/2

కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement