
దొంగ ఓట్లతో అధికారంలోకి..
నిజామాబాద్ సిటీ: ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నుంచి ధర్నాచౌక్ వర కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ధర్నాచౌక్ వద్ద ఓ టరు జాబితాను దహనం చేశారు. అనంతరం మా నాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్ల దొంగతనాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగం చేయగానే ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను మూసివేసిందన్నారు. నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ దొంగ ఓట్ల వ్యవహారం బయటపెట్టిన రాహుల్‌గాంధీని బీజేపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంభూపాల్, బాడ్సీ శేఖర్‌గౌడ్, జీ వీ రామకృష్ణ, విపుల్ గౌడ్, వేణురాజ్, రత్నాకర్, న రేందర్ గౌడ్, లింగం, కెతావత్ యాదగిరి, సయ్యద్ ఖైసర్, ప్ర మోద్, మధుసూదన్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్, సంగెం సాయిలు, మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి, పోల ఉష, పుప్పాల విజయ, స్వప్న, మీనా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన్ బీజేపీకి
తొత్తుగా మారింది
ఓట్ల గోల్‌మాల్‌ను
రాహుల్‌గాంధీ బయటపెట్టారు
డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార
సంఘాల కార్పొరేషన్ చైర్మన్
మానాల మోహన్‌రెడ్డి