
డొంకేశ్వర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏఐ పాఠాలు
● మద్రాస్ ఐఐటీ నుంచి స్కూల్ కోడ్ కనెక్ట్ ప్రోగ్రాం అనుసంధానం
● పదో తరగతి విద్యార్థులకు
రెండు నెలల పాటు బోధన
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో ఏఐ పాఠాలు బోధించనున్నారు. ఇందుకోసం మద్రాస్ ఐఐటీ డొంకేశ్వర్ జెడ్పీ స్కూల్‌లో బోధనకు అంగీకారం తెలిపింది. ఈమేరకు మద్రాస్ నుంచి స్కూల్ కోడ్ కనెక్ట్ ప్రోగ్రాంను పాఠశాలకు అనుసంధా నం చేసినట్లు హెచ్‌ఎం సురేశ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతు లు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. 10వ త రగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోలాజికల్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్ తదితర టెక్నాలజీలో బోధన చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్టిఫికెట్ కోర్సులు అందించనున్నారు. అ క్టోబర్‌లో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించి కోర్సు పత్రాలను అందజేస్తారు. ప్రస్తుతం డొంకేశ్వర్ పాఠశాల నుంచి 48మంది విద్యార్థులు ఈ కో ర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పదో తరగతిలోనే విద్యార్థులు ఐఐటీ సాంకేతికతపై పట్టు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని హెచ్‌ఎం అన్నారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్‌లో ఒకేషనల్ కోర్సు..
తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ విభాగంలో ఒకేషనల్ కోర్సు కూడా ప్రారంభమైనట్లు హెచ్‌ఎం తెలిపారు. తరగతి గదుల్లో బోధనలో భాగంగానే ఈ కోర్సును నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా మైండ్ లీడర్స్ సంస్థ తరపున ఒక టీచర్‌ను నియమించామన్నారు.