
భార్యతో ఫోన్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): ‘ఎన్ని నెలలైంది నువ్వు ఇక్కడికి వస్తలేవు.. నిన్ను అన్ని రకాలుగా బాగా చూసుకుంటాను. ప్లీజ్ వచ్చేయ్’ అంటూ భార్యతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉరేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై విజయ్ కొండ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేనూర్‌కి చెందిన సాబ్డె సాయిలు(31)కు నాలుగు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని చైన్‌పూర్ గ్రా మానికి చెందిన శోభతో వివాహమైంది. మనస్పర్థలతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన శోభ తిరిగి రాలేదు. ఈ క్రమంలో సోమవారం శోభకు సాయి లు ఫోన్ చేశాడు. కాపురానికి రావాలని బ్రతిమిలాడాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తల్లి సరుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
జీవితంపై విరక్తితో ఒకరు..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన కై రి నరేశ్(39) మద్యానికి బానిసై తన భార్యతో గొడవ పడి మూడు నెలల క్రితం ఫత్తేపూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడే ఉంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగించాడు. సోమవారం జీవితంపై విరక్తితో గుళికల మందు తాగి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కై రి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
కాపురానికి రావట్లేదని మనస్తాపంతో..