
పచ్చందనమే.. పచ్చదనమే
రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చదనం, ప్రకృతి అందాలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ గుట్టలు, కనుచూపుమేరలో పచ్చని పొలాలతో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి వెళ్లే దారి కనువిందు చేస్తోంది. ఈ దారిలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతంలో కేవలం వర్షపు నీటి ఆధారంగా గిరిజనులు గుట్టలపై మొక్కజొన్న, పెసర, మినుపు వంటి పంటల్ని సాగుచేస్తుంటారు. ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులకు ఈ పచ్చని సోయగాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్