
ఇంజినీరింగ్‌లో మొదటి రోజు ఐదుగురి చేరిక
తెయూ(డిచ్‌పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌లో 81 మందిని కేటాయించగా, మొదటిరోజైన సోమవారం ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. వీరంతా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)కి చెందిన విద్యార్థులేనని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. కౌన్సెలింగ్‌లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించారన్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం హాస్టల్ వసతి కల్పించకపోవడంతో పలువురు విద్యార్థినులు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.
తొలి విద్యార్థి అల్లె శ్రీచరణ్
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి అల్లె శ్రీచరణ్ తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో తొలి విద్యార్థిగా అడ్మిషన్ పొందారు. ఆయనకు ప్రిన్సిపాల్ సీహెచ్‌ఆరతి స్వాగతం పలికి అడ్మిషన్ అందజేశారు.
ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఖలీల్‌వాడి: ఆర్టీసీ ఎ క్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో గుర్తింపు కార్డు లేదా జిరాక్స్ కాపీని చూపి ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్ర యాణం చేయొచ్చని ఆర్‌ఎం జ్యోత్స్న సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పే ర్కొన్నారు. మహిళలు, బాలికలు, సీనియర్ సిటిజన్(మహిళ)లతోపాటు ట్రానన్స్‌జెండర్లు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న గుర్తింపు కార్డులను కండక్టర్‌కు చూపించాలని, మొబైల్ ఫోన్‌ల లో సైతం కార్డులు చూపి ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు.
రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల మరమ్మతు లు, నూతన రోడ్లకు రూ.80 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి వేరే జిల్లాలను కలుపుతూ ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో నిధు లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారని రాకేశ్‌రెడ్డి తెలిపారు.