
బోనస్‌కు బదులు మద్దతు ధర పెంచాలి
నేను పది ఎకరాల పొలం కౌలు తీసుకుని సాగు చేస్తున్నాను. గతంలో ఎకరాకు రూ.15 వేలు కౌలు ధర చెల్లించేవాడిని. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో భూయజమానులు వెంటనే కౌలు ధరను అమాంతం పెంచేశారు. ఇప్పుడు ఎకరాకు రూ.25 నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. బోనస్ డబ్బులు అదనపు ఆదాయం అనుకుంటే పెరిగిన కౌలు వల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇలా బోనస్ ఇవ్వకుండా వరికి మద్దతు ధర పెంచితే బాగుంటుంది. కౌలు రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. – లక్ష్మీ నారాయణ, కౌలు రైతు, ధర్మారం(బి), డిచ్‌పల్లి మండలం