ఫిజి, పోర్చుగల్‌ దేశాల్లో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఫిజి, పోర్చుగల్‌ దేశాల్లో ఉపాధి

Aug 3 2025 8:34 AM | Updated on Aug 3 2025 8:34 AM

ఫిజి, పోర్చుగల్‌ దేశాల్లో ఉపాధి

ఫిజి, పోర్చుగల్‌ దేశాల్లో ఉపాధి

మోర్తాడ్‌(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) పోర్చుగల్‌, ఫిజి దేశాల్లో పని కల్పించడానికి వీసాల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దళారుల మోసాలకు చెక్‌పెట్టాలనే సంకల్పంతో టామ్‌కామ్‌ విదేశీ వీసాల జారీకి సన్నద్ధం చేస్తోంది. గతంలో ఇజ్రాయిల్‌, జర్మనీ, జపాన్‌, గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పించిన ఈ సంస్థ తాజాగా పోర్చుగల్‌, ఫిజి ద్వీపంలో ఉపాధికి బాటలు వేస్తుంది.

పోర్చుగల్‌లో ఇలా...

పర్యాటక రంగంలోనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఈ రంగంలోనే వివిధ హోదాలలో పని చేయడానికి యువతకు అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌, కుక్‌, కిచెన్‌ అసిస్టెంట్‌, డిష్‌ వాషర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌, స్పా థెరపిస్ట్‌ ఉద్యోగాలకు అవకాశం ఉంది. డిగ్రీ, ఇంటర్‌, హోటల్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర సర్టిఫికెట్‌ కోర్సులు చదువుకుని ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి వీసాలు జారీ చేయనున్నారు. మన కరెన్సీలో రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనాలు అందనున్నాయి. హోదాను బట్టి జీతాలను నిర్ణయించనున్నారు. అలాగే ఎఫ్‌బీ మేనేజర్‌, హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజ ర్‌, హౌస్‌ కీపర్‌, వెయి టర్‌, మెయింటెనె న్స్‌ టెక్నీషియన్‌లు గా పని చేయడానికి అవకాశం ఉంది. డిప్లొమా, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ, ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ చదువుకుని ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి వీసాలు ఇవ్వనున్నారు. ఈ రంగంలో కూడా రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు హోదాను బట్టి జీతం చెల్లించనున్నారు.

ఫిజిలో ఇలా...

ఫిజిలో ఎఫ్‌ఎంసీజీ స్టోర్‌ మేనేజర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఆటో ఫర్‌ లిఫ్ట్‌ మెకానిక్‌, సర్వీస్‌ టెక్నీషియన్‌ , పానెల్‌ బీటర్‌, పానెల్‌ పెయింటర్‌, వాచ్‌ టెక్నీషియన్‌, వెల్డర్‌, బయ్యర్‌ అసిస్టెంట్‌, బాకర్‌, పాస్టీ బాకర్‌ పోస్టులకు వీసాలు ఇవ్వనున్నారు. రూ.45 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనం లభించ నుంది. సాంకేతిక నిపుణులు, ఐటీఐ, పదో తరగతి, ఇంటర్‌ చదివినవారికి అవకాశం కల్పించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్‌ ద్వారా వీసాల జారీకి సన్నద్ధం

విదేశాలకు వలస వెళ్లాలనుకునే

నిరుద్యోగులకు అవకాశం

ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో

దళారుల మోసాలకు చెక్‌

సద్వినియోగం చేసుకోవాలి..

ఫిజి, పోర్చుగల్‌ దేశాల్లో ఉపాధి కోసం జారీ చేయనున్న వీసాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ లేదా కార్యాలయంలో సంప్రదించాలి. మధ్యవర్తులను నమ్మి మోసపోవడం కంటే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా వీసాలు పొందడం ఎంతో మేలు.

– నాగ భారతి, టామ్‌కామ్‌ జనరల్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement