
పది కౌంటర్లు..700 గణేశ్ మండపాలకు చందాలు
● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: బాల గంగాధర్ తిలక్, శివాజీ మహరాజ్ స్ఫూర్తిగా హిందువుల్లో ఐకమత్యం పెంపొందించడమే లక్ష్యంగా ట్రస్ట్ ద్వారా నగర గణేశ్ మండపాలకు తనవంతు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ధన్‌పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధన్‌పాల్ ఆర్థిక సహకార కార్యక్రమం మంగళవారం రెండోరోజూ కొనసాగింది. పది కౌంటర్లు ఏర్పాటు చేసి, సుమారు 700లకుపైగా గణేశ్ మండపాలకు చందాలు అందజేశారు. హిందూ ధర్మరక్షణ, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం హిందువుల్లో ఐక్యత పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.