
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్సలు
నిజామాబాద్‌నాగారం: ఏడాది వయస్సు ఉన్న పాపకు జీజీహెచ్‌లో అరుదైన చికిత్స చేశారు. ఈ నెల 15న ఉదయం 3 గంటల సమయంలో పాముకాటుకు గురైన సారంగాపూర్‌కు చెందిన భానుశ్రీ అనే పాప ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పాముకాటు(క్రైట్–న్యూరోటాక్సిక్)తో ఇబ్బందులు పడింది. అదే రోజు ఉదయం 5.30గంటలకు పాపను ఐసీయూలో చేర్చినప్పుడు గ్యాస్పింగ్, చలిగా ఉండడం కనిపించిందని వైద్యులు తెలిపారు. పేషెంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెస్పిరేటరీ పారాలసిస్‌కు గురైందని వెద్యులు తెలిపారు. 9 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. పిల్లల వైద్య నిపుణులు, హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్లు డాక్టర్ ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్‌చంద్ర, డాక్టర్ కీర్తి, సీనీయర్ రెసిడెంట్ డాక్టర్ ఎండీ జైనులాబుద్దీన్, పీజీ వైద్యులు డాక్టర్ హరీశ్‌కుమార్, డాక్టర్ సందీప్‌ల బృంద పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం వెంటిలెటర్‌పై నుంచి పాపను బయటకు తీయగా, ఆరోగ్యం నిలకడగా ఉంది. పాప ఆరోగ్యం మెరుగవ్వడంతో తల్లిదండ్రులు కళ్యాణ్, లక్ష్మి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
8 నెలల గర్భిణికి..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు ఓ గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. నగరానికి చెందిన 8 నెలల గర్భిణి గడ్డెల జ్యోతి(36) నొప్పులతో ఈ నెల 19న జీజీహెచ్‌లో చేరారు. ఆమెకు సంక్లిష్టమైన గర్భధారణ సమస్య ఉందని వైద్యులు గుర్తించి తక్షణమే సిజేరియన్ ఆపరేషన్ చేసి అనంతరం హిస్టరెక్టమీ(గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స) నిర్వహించారు. అలాగే మూత్రశయం కూడా ప్రభావితమవడంతో దానిపై కూడా శస్త్ర చికిత్స చేశారు. అనంతరం కొన్ని రోజులు వెంటిలేటర్ సపోర్టు అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, నిపుణుల వైద్యంతో ప్రస్తుతం జ్యోతి అపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స చేసినవారిలో గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీప్రసన్న, జనరల్ సర్జరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణ, అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్, యురాలజిస్టు డాక్టర్ శబరీనాథ్ ఉన్నారు.