
ఉమ్మడి జిల్లా సైనికుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్
నిజామాబాద్ లీగల్: నగరంలోని సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో మంగళవారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ లీగల్ క్లినిక్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సైనికులు, వారి కుటుంబాలకు న్యాయ సహాయం అందించనున్నారు. సెంటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కరరావు కోరారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్యానెల్ న్యాయవాదిగా బాలరాజు నాయక్‌ను నియమించారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ప్రారంభోత్సవంలో రెండో అదనపు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టి శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి ఉదయ భాస్కర్ రావు, జిల్లా ఇన్‌చార్జి సైనిక సంక్షేమ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.