
మండప నిర్వాహకులు.. పాటించాలి జాగ్రత్తలు
● సీపీ పోతరాజు సాయిచైతన్య
● వినాయక నవరాత్రుల సందర్భంగా కీలక సూచనలు
ఖలీల్‌వాడి: వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలను తొమ్మిది, పదకొండు రోజులపాటు నిర్వహిస్తారు. ఉత్సవాల కోసం ఊరూరా, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు సీపీ పోతరాజు సాయిచైతన్య పలు కీలక సూచనలు చేశారు.
● ఆన్‌లైన్ పోర్టల్ https://policeportal. tspolice.gov. inలో వివరాలను నమోదు చేయాలి.
● దరఖాస్తు అనంతరం జనరేట్ అయిన క్యూఆర్ కోడ్‌ను వినాయక మండపం వద్ద పోలీసులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి.
● కరెంట్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
● విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్‌కో అనుమతి తీసుకోవాలి.
● విద్యుత్ తీగలపై వర్షపు నీరు పడకుండా చూడాలి. ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
● అగ్ని ప్రమాదాల నివారణకు మండపం వద్ద నీటితో నింపిన బకెట్, ఇసుక బస్తాలను ఉంచాలి.
● అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించి, మంటలు వ్యాపించకుండా ఆర్పేందుకు ప్రయత్నించాలి.
● మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
● ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు మండపం వద్ద ఉండాలి.
● మండపం చుట్టుపక్కల ఉండేవారికి ఇబ్బంది కలిగించకుండా పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టొద్దు.
● సోషల్ మీడియాలో వచ్చే వద్దంతులు నమ్మొద్దు. అసత్య ప్రచారం చేయొద్దు.
● నిమజ్జన ఊరేగింపు బాధ్యతను నిర్వాహకుల్లో ఇద్దరికి అప్పగించాలి.
● వినాయక రథానికి ఇరువైపులా తాళ్లు పట్టుకోవడానికి కనీసం నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయాలి.
● జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో టపాసులు వెలిగించొద్దు.
● చెరువులు, వాగుల వద్ద నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
● అవాంఛనీయ ఘటన జరిగితే డయల్ 100 కాల్ చేయాలి.

మండప నిర్వాహకులు.. పాటించాలి జాగ్రత్తలు

మండప నిర్వాహకులు.. పాటించాలి జాగ్రత్తలు