
తెయూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య కమిటీ ఎన్న
● అధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా నరాల సుధాకర్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ , పీజీ కళాశాలల యాజమాన్య కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్‌లో మంగళవారం తెయూ పరిధిలోని అన్ని ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్స్ సభ్యులు, కరస్పాండెంట్లు పాల్గొని కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజీస్ కరస్పాండెంట్, సీఈవో డాక్టర్ ఎం.జైపాల్‌రెడ్డి (కామారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నరాల సుధాకర్ (నిజామాబాద్), కోశాధికారిగా మీమ్స్ డిగ్రీ కాలేజ్ యజమాని శ్రీనివాస్ రాజు (బోధన్), ఉపాధ్యక్షులుగా ఎస్పీఆర్ డిగ్రీ కాలేజీ యజమాని అరుణ్‌కుమార్ రెడ్డి (డిచ్‌పల్లి), శశాంక్ డిగ్రీ కాలేజీ యజమాని సయ్యద్ హకీం (బాన్సువాడ), సంయుక్త కార్యదర్శులుగా సిద్ధార్థ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ నవీన్ (ఆర్మూర్), రాజేశ్వరరావు (కామారెడ్డి), అసోసియేట్ అధ్యక్షుడిగా సంజీవ్‌రెడ్డి (ఆర్మూర్), స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గురువేందర్‌రెడ్డి (కామారెడ్డి), హరిప్రసాద్ (నిజామాబాద్), లీగల్ అడ్వయిజర్‌గా ప్రముఖ న్యాయవాది, మాజీ పీపీ రాజేందర్‌రెడ్డిను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డిలకు వీడ్కోలు సన్మానం చేశారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులుగా హరిస్మరణ్, శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మారయ్య గౌడ్ , శంకర్, సూర్యప్రకాశ్, సృజన్ రెడ్డి, బాలాజీ రావు, ప్రతాప్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు.