రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్థే! | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్థే!

May 7 2025 12:35 AM | Updated on May 7 2025 12:35 AM

రాష్ట

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్టేట్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా నియమితులైన ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన 1982 –85 లో ఇక్కడ బీఎస్సీ ఫా రెస్ట్రీ కోర్సు చదివారు. కళాశాల అలుమ్నికి పలుమార్లు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం బోర్గావ్‌ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి.. అప్పట్లో కామారెడ్డిలో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశారు. కా మారెడ్డిలో ఆయనకు చాలామంది మిత్రులున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి లైఫ్‌ సైన్సెస్‌ లో పీజీ చేశారు. 1991లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా ఎంపికై వివిధ ప్రాంతాల్లో పనిచేశారు.

నేడు జిల్లాస్థాయి

చెస్‌ ఎంపిక పోటీలు

నిజామాబాద్‌నాగారం: జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌ – 7, 9, 11 బాలబాలికల విభాగంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నగరంలోని అభ్యాస స్కూల్‌లో బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రమేశ్‌, ఆరుట్ల రమేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2018 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్‌ – 7 విభాగంలో, 2016 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్‌ – 9 విభాగంలో, 2014 జనవరి 1 తరువాత జన్మించిన వారు అండర్‌ – 11 విభాగంలో ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. మరిన్ని వివరాలకు 94400 07004 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఎంఎల్‌హెచ్‌పీలకు

బ్రిడ్జి కోర్సు ప్రారంభం

నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌, కా మారెడ్డి జిల్లాల్లో నూతనంగా నియామకమైన ఎంఎల్‌హెచ్‌పీ లకు మూడు నెలల బ్రిడ్జి కోర్సును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ బి రాజశ్రీ మంగళవారం ప్రా రంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ లకు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, జాతీయ వ్యా ధి నిరోధక టీకాల కార్యక్రమం, ప్రజారో గ్యం కుటుంబ సంక్షేమం, జీవనశైలి వ్యాధు లు, ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య కార్యక్రమాల ఆన్లైన్‌ ఎంట్రీ, పీసీపీఎన్డీటీ, జాతీయ ఆరోగ్య మిషన్‌ అంశాలపై మూడు నెలలు పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగే శి క్షణ కార్యక్రమానికి ఎంపికై న ఎంఎల్‌హెచ్‌పీ లు క్రమం తప్పకుండా హాజరుకావాలన్నా రు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రాజు, డీహెచ్‌ఈ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

వరల్డ్‌ యూనివర్సిటీ

చాంపియన్‌ షిప్‌నకు ఎంపిక

నిజామాబాద్‌ నాగారం: ఆల్‌ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్‌ ట్రయల్స్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ చాంపియన్‌ షిప్‌ స్విమ్మింగ్‌ పోటీలకు జిల్లాకు చెందిన రిత్విక ఎంపికై ంది. గత నెల 24, 25 తేదీల్లో కర్నాటక రాష్ట్రంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్‌ పోటీల్లో రిత్విక ఉత్తమ ప్రతిభ కనబర్చి 50 మీటర్ల బెస్ట్‌ స్ట్రోక్‌ స్విమ్మింగ్‌లో బంగారు పతకం సాధించింది.

దేశం తరఫున వరల్డ్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌ – 2025 పోటీలకు ఎంపికై న రిత్విక జర్మనీ దేశంలోని బెర్లిన్‌ నగరంలో జులై 16 నుంచి 27వ తేదీ వరకు జరగను న్న పోటీల్లో పాల్గొననుంది.రిత్వికను మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, నిజామాబాద్‌ అ ర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అఽ ద్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి ఉమే శ్‌, ఉపాధ్యక్షులు జి మహిపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కర్నాటక శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్‌, రాగిణి తదితరులు అభినందించారు.

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్1
1/2

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్2
2/2

రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కామారెడ్డి విద్యార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement