భగీరథుని స్ఫూర్తితో ముందుకు సాగాలి
జ్యోతిప్రజ్వలన చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
నిజామాబాద్‌అర్బన్: కష్టమైన కార్యం సాధించాలంటే భగీరథుని స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివా రం కలెక్టరేట్‌లో నిర్వహించారు. వేడుకలకు హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగీరథుడు ఘోర తపస్సు ద్వారా ఆకాశ గంగను భూమికి తె చ్చాడని పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడిందని గుర్తుచేశారు. మహనీయుల స్ఫూర్తితో సమాజ హి తానికి పాటుపడేందుకు వీలుగా ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. మహనీయుల ఆలోచనా విధానాలతో ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్స య్య, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
ఘనంగా భగీరథ మహర్షి జయంతి


