ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య

May 2 2025 1:25 AM | Updated on May 2 2025 1:25 AM

ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడింది. దీనికి నిదర్శనమే బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాలు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా బోధన ఎంత ముఖ్యమో.. పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. విద్యావ్యవస్థలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయని చెప్పొచ్చు. జిల్లా కేంద్రంలో పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరిగిందని జిల్లా అధికారులు పేర్కొంటున్నా మెరుగైన ఫలితాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించకపోవడమే అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

నార్త్‌, సౌత్‌ మండలాల్లో తక్కువ..

నార్త్‌ మండలంలో 248 మంది పరీక్ష రాయగా 215 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో 32 మందికి 25 మంది, కుమార్‌గల్లి పాఠశాలలో 19 మందికి 15 మంది, ఖలీల్‌వాడి పాఠశాలలో 79 మందికి 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. సౌత్‌ మండలంలో 361 మంది పరీక్ష రాయగా 240 మంది విద్యార్థులు పాసయ్యారు. కోటగల్లి శంకర్‌ భవన్‌ పాఠశాలలో 107 మందికి 61 మంది విద్యార్థులే పాసయ్యారు. వాటర్‌ ట్యాంక్‌ ఉన్నత పాఠశాలలో 21 మందికి 13 మంది, కసాబ్‌గల్లి పాఠశాలలో 135 మందికి 93 మంది, ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో 62 మందికి 45 మంది విద్యార్థులు పాసయ్యారు. జిల్లా వ్యాప్తంగా 766 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయితే అందులో నార్త్‌, సౌత్‌ మండలంలో 154 మంది విద్యార్థులు ఉన్నారు. నార్త్‌, సౌత్‌ మండలాల్లో విద్యావ్యవస్థ గాడితప్పింది. ఇక్కడ జిల్లా కేంద్రం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడే ఉన్నారు. వారు సంఘాల పేరిట ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు, సభ్యత్వాల నమోదు వంటి కార్యక్రమాలు చేపడుతూ పాఠశాలలకు డుమ్మాలు కొడుతున్నారు. గైర్హాజరును అరికట్టేందుకు ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించకపోవడం విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. తరచూ విద్యార్థి సంఘాల తరగతుల బహిష్కరణ కూడా దీనికి కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు వత్తాసు పలుకుతుండడంతో పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడుతోంది. సరైన విద్యాబోధన చేపట్టకపోవడంతోనే విద్యార్థులు చాలా మంది ఉత్తీర్ణులు కాలేదని పలువురు పేర్కొంటున్నారు.

ఇందుకు నిదర్శనమే ‘పది’ ఫలితాలు

నార్త్‌, సౌత్‌ మండలాల్లో

154 మంది విద్యార్థులు ఫెయిల్‌

పరిశీలన చేస్తాం

నార్త్‌, సౌత్‌ మండలాల్లో ఫలితాలు తక్కువ రావడంపై పరిశీలన చేస్తాం. మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళిక రూపొందిస్తాం.

– అశోక్‌, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement