
సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని వినతి
నిజామాబాద్ రూరల్: రూరల్ పరిధిలోగల మహాలక్ష్మీనగర్ కాలనీ–2 డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో కాలనీవాసులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సీసీ రోడ్లు లేవని, అదేవిధంగా డ్రైనేజీలు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీ వాసులు మహేష్ రెడ్డి, సాయిలు, రవి, నామసింగ్, మూర్తి, మహేందర్, సత్యనారాయణ, మధు, గజ్జెల శంకర్, గంగాధర్, నాగరాజు శర్మ .హరిష్ తదితరులు పాల్గొన్నారు.