
అక్రమార్కులకు శిక్ష పడాలి
ఖలీల్‌వాడి: అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారికి శిక్ష పడేలా చూడాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ పీ లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాదక ద్రవ్యాల కేసులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమందు, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకై న్ మొదలైన మాదకద్రవ్యాల కేసులో ముద్దాయిలకు శిక్ష పడేలా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధకంతో విద్యార్థులు, యువకులకు తోడ్పాటును అందించనట్లవుతుందని తెలిపారు. అనంతరం నూతనంగా నియామకమైన కామారెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీ సూర్యప్రసాద్‌ను సత్కరించారు. సమావేశంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీసు రాజేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ గౌడ్, రాజారెడ్డి, డీ సూర్యప్రసాద్, బంటు వసంత్, దామోదర్ రెడ్డి, కావేటి శేషు, శ్రీనివాస్ ఖాందేశ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జీ రామకృష్ణ, భూసారపు రాజేశ్ గౌడ్, అశోక్ శివరాంనాయక్, చిదిరాల రాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జికి సన్మానం
బదిలీపై వెళుతున్న జిల్లా జడ్జి సునీతా కుంచాలను ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య మాట్లాడు తూ విధి నిర్వహణలో భాగంగా జిల్లా జడ్జిగా ఎంతో సామరస్యంగా ఎన్నో కేసులలో జీవితా కారాగార శిక్ష విధించారన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్
ప్రాసిక్యూటర్ లక్ష్మీనర్సయ్య