ఆర్మూర్: దశాబ్దాలు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారినా ఆర్మూర్ లెదర్ పార్క్‌కు మోక్షం కలగడం లేదు. చర్మకారులు, చేతివృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేసిన నిధులతో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణం పను లు చివరి దశకు చేరుకున్నాయి. రూ.10 కోట్లతో చేపడుతున్న ప్రస్తుత నిర్మాణ పనులు పూర్తయిన తర్వాతైనా చర్మకారుల బతుకుల్లో వెలుగులు వచ్చేనా అనే చర్చ మొదలైంది.
తుది దశకు మరో భవన నిర్మాణం..
ఆర్మూర్ పట్టణ శివారులో చర్మ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2017లో రూ.10 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యటన అనంతరం 80 శాతం కేంద్రం నిధులు, 20 శాతం రాష్ట్రం నిధులతో ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఐవో గ్రాంట్ రూ.2 కోట్ల 60 లక్షలను 2019లో డిపాజిట్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తన వాటా ధనాన్ని కలిపి 2022లో రూ.10 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో చర్మ పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఏడాది క్రితం ప్రారంభమయ్యాయి. రూ.కోటీ 80 లక్షలతో అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మా ణం పూర్తి కావొస్తుండగా, తమ జీవితాలు మలుపు తిరగనున్నాయని చర్మకారులు భావిస్తున్నారు.
2003లో శంకుస్థాపన
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్మూర్ ప్రాంత చర్మ కార్మికుల కు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో లిడ్ క్యాప్(చర్మ పరిశ్రమ)నకు 2003 ఆగస్టు 20న అప్ప టి మంత్రి మండవ వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. జిరాయత్‌నగర్‌లోని యానంగుట్ట వద్ద 28 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి రూ.10 లక్షలు మంజూరు చేయగా, చెప్పులు తయారు చేసే భవన నిర్మాణం పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. 60 మంది చర్మకారులను మాస్ట ర్ ట్రైనర్లుగా గుర్తించి వారిని చైన్నెకి పంపించి ఆరు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. ప్రస్తు తం వీరంతా ఉపాధి లేక ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి రోడ్లపై పాత చెప్పులకు మరమ్మతులు చేస్తున్నారు.
దశాబ్దాలుగా చర్మకారుల
ఎదురుచూపులు
గతంలోనే మాస్టర్ ట్రైనర్లుగా
శిక్షణ పొందిన 60 మంది..
తుది దశకు అడ్మినిస్ట్రేషన్
భవన నిర్మాణ పనులు
మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చర్మ పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయి. చర్మకారులు ఇక్కడ ఉపాధి కల్పించుకోవడానికి పూర్తి అవకాశాలను కల్పిస్తాం. కేటాయించిన స్థలంలో 120 ప్లాట్లు చేసి అర్హత మేరకు చర్మకారులకు ఇస్తాం. – ప్రవీణ్ కుమార్, జనరల్ మేనేజర్,
మైక్రో అండ్ స్మాల్ ఎంప్లాయీస్ డిపార్ట్‌మెంట్
లెదర్‌పార్క్‌కు మోక్షమెన్నడో?