
కమనీయం.. శ్రీవారి కల్యాణం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిగింది. అంతకుముందు స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. స్వామి వారి కల్యాణం.. లోక కల్యాణమని, ఆ ఘ ట్టాన్ని తిలకిస్తే సకల పాపాలూ తొలగిపోతాయని దేవనాథ జీయర్ స్వామి, గంగోత్రి రామానుజదాసు స్వామి ప్రవచించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నర్సింహారెడ్డి, విజయసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాము లు, నరాల సుధాకర్, పృథ్వీ, నర్సారెడ్డి, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, భాస్కర్, నరేందర్, మురళి, రాజేశ్వర్, యాజ్ఞాచార్యులు శిఖామణి, సత్యనారాయణ స్వామి, శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
సినీ ప్రముఖుల సందడి