ధర్పల్లి: జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వాన రైతులను ఆగమాగం చే స్తూ తీరని నష్టాన్ని మిగిల్చింది. శుక్రవారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కు ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని వరి పంట దె బ్బతింది. మరో రెండు మూడు రోజుల్లో వరి కోత లు ప్రారంభించనున్న సమయంలో అకాల వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. వడగళ్ల వానల దాటికి వరి పంటలు నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల భారీ గాలులకు పంట నేలకు ఒరిగిపోయింది. ధర్పల్లి మండలంలో ని మద్దుల్‌తండా, హోన్నాజీపేట్, వాడీ, సీతాయిపే ట్ గ్రామ రెవెన్యూ పరిధిలో వడగండ్ల వానకు 174 మంది రైతులకు సంబంధించి 265 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సిరికొండ మండలం కొండూర్ , చీమన్‌పల్లి, చిన్నవాల్గొట్ గ్రామాల పరిధిలో 700 ఎకరా ల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమి క అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. పంట చివరి దశలో భూమిపాలు కావడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
● ధర్పల్లి మండలం మద్దుల్‌తండాకు చెందిన రైతు గోవింద్ 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోతదశకు వచ్చినప్పటికీ తన అన్న చనిపోవడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేక వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకున్నాడు. శుక్రవారం కురిసిన వడగళ్లకు పూర్తిగా వరి గింజ నేలరాలిపోయింది. పొలం కోసం రూ. 60వేలు పెట్టుబడి పెట్టగా, మరో రెండు రోజుల్లో కోతలు మొదలు పెట్టేలోపే వర్షం వల్ల పంట నష్టపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు వ్యవసాయమే జీవనాధారం అని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గోవింద్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
వడగండ్లతో దెబ్బతిన్న వరి పంట
ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు
దెబ్బతిన్న పంటపొలాల పరిశీలన
ధర్పల్లి/సిరికొండ: వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను శనివారం ఏడీఏ ప్రదీప్ కుమార్, ఏవో వెంకటేష్, నర్సయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్, వాడీ, మద్దుల్ తండా, సీతాయిపేట్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి, నమోదు చేశారు. ధర్పల్లి మండలంలో 174 మంది రైతులకు చెందిన 265 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా వేసినట్లు వారు తెలిపారు. అలాగే సిరికొండ మండలంలోని కొండూర్, చిన్నవాల్గోట్, చీమన్‌పల్లి, సిరికొండ గ్రామాల్లో సుమార 700–750 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.
పంట నేలరాలిపోయింది..
ఈ యాసంగిలో ఆరున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. కానీ ఇటీవల కురిసిన వడగండ్లకు ఆరున్నర ఎకరాల్లో ఒక్క వరి గింజ కూడా లేకుండా పూర్తిగా నేలరాలిపోయింది. ఇప్పుడు పచ్చి గడ్డి తప్ప ఏమి లేదు. రూ.1.80 లక్షల పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వస్తుందని ఆశిస్తే వడగళ్ల వర్షానికి పంట మొత్తం నేలపాలయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి
–మోహన్ రెడ్డి, రైతు, వాడి
రైతన్నను ఆగం చేసిన వాన
రైతన్నను ఆగం చేసిన వాన


