రైతుల సంక్షేమమే ధ్యేయం
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు
● విజయవంతంగా కొనసాగుతున్న ‘పొలం బాట’
సుభాష్‌నగర్: రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకు సాగుతోందని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కో సం అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించే విద్యుత్ అధికారుల ‘పొలం బాట’ విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొ న్నారు. సర్కిల్ పరిధిలో 1,339 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించి 409 వంగిపోయిన స్తంభాలను సరిచేశామని, 656 చోట్ల లూజ్ లైన్లను బిగించామని తెలిపారు. 380 మధ్య స్తంభాలను (ఇంటర్ పోల్స్) ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదరహిత సర్కిల్‌గా తీర్చిదిద్దేందుకు జీరో విద్యుత్ ప్రమాదాల కార్యక్రమం చే పట్టినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు ఎ లాంటి విద్యుత్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు సూచించారు.
ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
నిజామాబాద్‌అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు బాత్‌రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఖలీల్‌వాడిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఒకటౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్(26) కొన్నేళ్లుగా ఖలీల్‌వాడీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పు ఉంది. అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాడ్డాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


