చేప పిల్లల పంపిణీ పూర్తి చేయండి
● జిల్లా మత్స్యశాఖకు
రాష్ట్ర అధికారుల ఆదేశాలు
● ఇప్పటి వరకు చెరువుల్లోకి
70 శాతం మీనాల విడుదల
డొంకేశ్వర్(ఆర్మూర్): చేపపిల్లల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా మత్స్యశాఖను రాష్ట్ర శాఖ ఆదేశించింది. ఆలస్యం చేయకుండా ఈ నెల 10వ తేదీ నాటికి చెరువుల్లో చేపపిల్లలు పోయడం పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు జా రీ చేసింది. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీని వే గవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ విధించిన గడువుకు ముందే పూర్తి చేసేలా జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. టెండర్లలో జాప్యం కారణంగా ప్రభుత్వం ఈ ఏడాది చేపపిల్లల పంపిణీని మూడు నెలలు ఆలస్యంగా ప్రా రంభించింది. జిల్లాలో 967 చెరువుల్లో రూ.4.18 కోట్ల విలువ గల 4.54 కోట్ల చేప పిల్లలు పోయా లని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో 35–40 ఎంఎం అలాగే 80–100 ఎంఎం చేప పిల్లలున్నాయి. నవంబర్ 15 నుంచి జిల్లాలో చేప పిల్లల పంపిణీని ప్రారంభించగా డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు 805 చెరువుల్లో 3.20 కోట్ల (70శాతం) మీనాలను పోశారు. పెద్ద సైజుతోపాటు నాణ్యమైన చేపపిల్లలను పోయడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా మిగిలిన 162 చెరువుల్లో 1.31 కోట్ల చేప పిల్లలను పోయాల్సి ఉంది. వీటిని గడువులోగా పోయాలని కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
వారం రోజుల్లో..
జిల్లాలో చేపపిల్లల పంపిణీని ఈ నెల 10లోగా పూర్తి చే యాలని రాష్ట్రశాఖ ఆదేశించింది. ఆదేశాల మేరకు మిలిగిన లక్ష్యాన్ని గడువుకు ముందే వారం రోజుల్లో పూర్తిచేస్తాం. పరిస్థితిని కాంట్రాక్టర్లకు వివరించి జాప్యం చేయవద్దని సూచించాం.
– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి
చేప పిల్లల పంపిణీ పూర్తి చేయండి


