పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి | - | Sakshi
Sakshi News home page

పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి

Jan 3 2026 7:58 AM | Updated on Jan 3 2026 7:58 AM

పురపా

పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి

ఆర్మూర్‌: మోర్తాడ్‌ మండలానికి చెందిన నారాయణ (పేరు మార్చాము) ఇటీవల తన ఓటు హ క్కును ఆర్మూర్‌కు బదిలీ చేయించాడు. సొంత గ్రా మం మోర్తాడ్‌ అయినా ఆరేళ్లుగా తాను ఆర్మూర్‌లో నివాసం ఉంటున్నానని ఓటు హక్కును మార్చుకున్నట్లు చెబుతున్నాడు. అయితే, ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలో ఓటేసిన నారాయణ ప్రస్తుతం నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేయడానికి అనర్హుడు. అసెంబ్లీ, పార్లమెంట్‌, జీపీ ఎన్నికల వరకు మోర్తాడ్‌లోనే ఓటేసిన ఈయనకు అత్యవసరంగా ఆర్మూర్‌కు తన ఓటు హక్కు మార్చుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. అతని మిత్రుడు వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేసే ఆలోచన చేస్తుండటంతో అతనికి అండగా నిలిచి ఓటు వేసేందుకు మోర్తాడ్‌ నుంచి ఆర్మూర్‌కు ఓటును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓటర్ల అడ్రస్‌ మార్పు నిజామాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఈ మధ్య జోరుగా జరుగుతున్నాయి.

విజయం కోసమే..

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పలువురు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల దిగుమతికి పాల్పడుతున్నారు. స్థానికంగా ఓటు హక్కు లేని ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను మున్సిపాలిటీ పరిఽధిలోకి బదిలీ చేయడం లేదా కొత్తగా ఓటు హక్కును నమోదు చేయించడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్లలో ప్రత్యేకమైన యాప్‌ ద్వారా ఓటు హక్కు నమోదు, బదలాయింపు చేసుకోవడం సులభంగా మారడంతో కొందరు అక్రమార్కులు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌ మున్సిపాలిటీలకు సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులు ఉండటంతో కూలీ పనులకు ఈ ప్రాంతాలకు వచ్చిన వారిని గుర్తించి వారికి ఓటు హక్కు తీసుకోవడం లేదా వారి ఓటు హక్కును బదలాయించడం చేస్తున్నారు. ఆర్మూర్‌లో సైతం ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు ఉండటంతో వారి ఓట్లను ఇక్కడికి మారుస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో అధికారులు సేకరించిన ఓటర్ల వివరాలతో పోలిస్తే ఈ తేడా గణనీయంగా కనిపించనుంది. మున్సిపల్‌ ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇలాంటి దిగుమతి ఓట్లు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉందని అధికారులు చర్చించుకుంటున్నారు.

జీపీ ఎన్నికల్లో ఓటేస్తే అనర్హులే..

జిల్లాలో చాలా మంది పిల్లల చదువులు, ఉద్యో గ, ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాల కు వలస వస్తుంటారు. కానీ వారి ఓటు హ క్కును మాత్రం సొంత గ్రామాల్లోనే కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారంతా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కొందరు నాయకులు గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి వారి ఓట్లను మున్సిపాలిటీల పరిధిలోకి బదలాయిస్తున్నారు. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే వివిధ పార్టీల పోలింగ్‌ ఏజెంట్లు ఇలాంటి ఓటర్లను గుర్తించి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..

గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లను మున్సిపాలిటీల పరిధిలోకి బదలాయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిని స్థానికులు గుర్తించి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.

– పూజారి శ్రావణి, మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్మూర్‌

గ్రామీణ ప్రాంతాల నుంచి

బదలాయిస్తున్న నేతలు

మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల

నుంచి సైతం

పోలింగ్‌ ఏజెంట్లు గుర్తిస్తే

బదలాయింపులకు అడ్డుకట్టపడే అవకాశం

పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి1
1/1

పురపాలికల్లోకి ఓటర్ల దిగుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement