ఆక్రమణలు.. ఉల్లంఘనలు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలు.. ఉల్లంఘనలు

Jan 3 2026 7:58 AM | Updated on Jan 3 2026 7:58 AM

ఆక్రమ

ఆక్రమణలు.. ఉల్లంఘనలు

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026

IIలో u

నేటి నుంచి టెట్‌

జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష

ఖలీల్‌వాడి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం తొ మ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్షలు కొనసాగుతాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 నుంచి 11.30 వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. టెట్‌ నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో మూడు, ఆర్మూర్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈసారి టెట్‌కు సాధారణ అభ్యర్థులతోపాటు జిల్లాకు చెందిన సుమారు 3 వేలకు పైగా టీచర్లు పరీక్ష రాయనున్నారు.

విడతల వారీగా

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

డీఐఈవో రవికుమార్‌

నిజామాబాద్‌ అర్బన్‌: విద్యార్థుల సంఖ్య మేరకు విడతల వారీగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తామని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్‌ తెలిపారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలలో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్‌పై జిల్లా అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్ని గురుకుల కళాశాలలలో ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయమన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఖాలిక్‌ పాషా, శ్రీనాథ్‌, రాజీయుద్దీన్‌ అస్లాం, విద్యుత్‌, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

మరోసారి దొంగల అలజడి

బంగారు దుకాణంలో చోరీకి యత్నం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో మరోసారి దొంగల అలజడి రేగింది. వరుసగా వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనానికి యత్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున సుభాష్‌నగర్‌లోని బంగారు దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. గునపాలతో షెట్టర్‌ను తొలగించి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్‌ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దొంగల కోసం గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఇటీవల ఖలీల్‌వాడిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంను కొల్లగొట్టేందుకు దొంగలు ప్రయత్నించగా పెట్రోలింగ్‌ పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయి, చివరికి పోలీసులకు చిక్కారు. సుభాష్‌నగర్‌లో దుండగులు చోరీకి యత్నించిన బంగారు దుకాణాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిర్మాణాల్లో విచ్చలవిడిగా ఉల్లంఘనలు జరుగుతు న్నాయి. ఆక్రమణలను బట్టి అంతేస్థాయిలో ముడుపులు అందుకుంటున్న అధికారులు అక్రమార్కు లను ప్రోత్సహించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్థలాలను, లేఅవుట్లలోని పది శాతం స్థలాలను ఆక్రమించుకునేందుకు కబ్జాదారులను మున్సిపల్‌ అధికారులు ప్రోత్సహించి ముడుపులు దండుకుంటున్నారు. దీంతో నగరంలో ప్రభుత్వ అవసరాలకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం చిన్న జాగాను కూడా కేటాయించలేని దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మున్సిపల్‌ అధికారులు జే బులు నింపుకుంటున్నారు. టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది అక్రమాలకు మార్గాలు చూపిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. మాఫియా మాదిరిగా సెటిల్‌మెంట్లు సైతం చేస్తున్నారంటూ పలువురు బాధితులు చెబుతున్నారు.

● నగరంలోని కేసీఆర్‌ కాలనీలో 60 ఫ్లాట్లతో ఓ భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. పలువురు ఇప్పటికే ఫ్లాట్లు కొనుక్కున్నారు. 2023 జూన్‌లో కొనుగోలుదారులకు పూర్తిగా కట్టించి అప్పగించేలా బిల్డర్‌ ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంకు రుణాలు తీసుకున్నవాళ్లకు ఇప్పటివరకు ఇవ్వకపోగా సదరు బిల్డర్‌ కొందరు కొనుగోలుదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటివరకు ఫ్లాట్‌ హ్యాండోవర్‌ చేయకపోవడంతో కొందరు కొనుగోలుదారులు రెరా (రియల్‌ ఎస్టేట్‌ రె గ్యులేషన్‌ అథారిటీ)కు ఫి ర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా ఇందులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలే కావడం గమనార్హం. విజిటర్స్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో జిమ్‌, క్లబ్‌ హౌస్‌ కట్టడం విశేషం. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్‌వోసీ కోసం జిమ్‌, క్లబ్‌ హౌస్‌కు సంబంధించి ఒకవైపు గోడలు కూల్చేయడం పరిస్థితికి నిదర్శనం. ఎన్‌వోసీ రాగానే మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసేందుకు మిగిలిన మూడువైపుల గోడలు మాత్రం కూల్చకుండా ఉంచారు. ఇందుకు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 4వ ఫ్లోర్‌, 5వ ఫ్లోర్‌లో నిబంధనలను తుంగలో తొక్కి 9.6 అడుగులకు బదులు, కేవలం 8.8 అడుగులు మాత్రమే రూఫ్‌ ఉండేలా శ్లాబ్‌ పోయడం గమనార్హం. పైగా మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండానే సెమీ ఫినిష్‌డ్‌గా చూపించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోకి 15 కుటుంబాలు చేరాయి. ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండానే కొనుగోలుదారులను గృహప్రవేశాలు చేయించి మోసం చేయడంతో పాటు ప్రభుత్వ పన్నులు సైతం బిల్డర్‌ ఎగ్గొడుతుండడం గమనార్హం. ఇందులో డ్రెయిన్‌ పైపు కిందినుంచి వేయడంతో నీరు రివర్స్‌ వచ్చేలా ఉందని పలువురు తెలిపారు. ఇక అపార్ట్‌మెంట్‌ చుట్టూ ఫైరింజన్‌ తిరిగే పరిస్థితి లేదు. ఇంకుడుగుంటల ఊసే లేదు. ఇక మరో ముఖ్యమైన అంశమేమిటంటే దీనికి నాలా కన్వర్షన్‌ లేదని మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 234, 251/ఏ లో ఎన్ని గజాలు ఉందో డాక్యుమెంట్‌లో స్పష్టంగా లేకపోవడం కొసమెరుపు. ఇన్ని ఉల్లంఘనలు ఉన్నప్పటికీ మున్సిపల్‌ అధికారులు ముందుకే వెళుతుండడం విశేషం.

● ఈ విషయాలపై నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా కేసీఆర్‌ కాలనీలో అపార్ట్‌మెంట్‌ విషయమై, వినాయక్‌నగర్‌లో నిబంధనల ఉల్లంఘనపై, ముబారక్‌నగర్‌లో గ్రీన్‌బెల్ట్‌ భూమి ఆక్రమణ వ్యవహారంపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

నగరపాలకంలో అక్రమాలకు

టౌన్‌ప్లానింగ్‌ ప్రోత్సాహం

పదిశాతం భూమి ఆక్రమణలు, నిబంధనలు

ఉల్లంఘించి చేస్తున్న నిర్మాణాలకు వెన్నుదన్ను

ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్న

మున్సిపల్‌ అధికారులు

ఎన్ని ఉల్లంఘనలు.. ఎంత అక్రమం ఉంటే

అంతగా వసూళ్లు

వినాయక్‌నగర్‌లో మాజీ మేయర్‌ ఆకుల సుజాత ఇంటి సమీపంలో నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న నిర్మాణం గురించి తాజాగా అధికారులకు మరో ఫిర్యాదు అందింది. ఇక్కడ 20 అడుగుల డెడ్‌ ఎండ్‌ రోడ్డు ఉంది. తరువాత కేవలం 7 అడుగుల రోడ్డు మాత్రమే ఉండగా, దీన్ని 20 అడుగుల రోడ్డుగా చూపించి ఒక వ్యక్తి భవనం నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నాడు. సెట్‌ బ్యాక్‌, ఎఫెక్టెడ్‌ ఏరియా వదలకుండా నిర్మాణం చేయడం గమనార్హం. ఇక్కడ మొత్తం 137.86 చదరపు మీటర్ల స్థలం ఉండగా, ఇందులో 35.29 చదరపు మీటర్ల మేర ఎఫెక్టెడ్‌ ఏరియాగా, మిగిలిన 102.57 చదరపు మీటర్ల మేర మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్లింత్‌ఏరియా 60.95 మీటర్లు మాత్రమే ఉండేలా అనుమతులు ఇచ్చారు. అయితే 137.86 చదరపు మీటర్ల మేర శ్లాబ్‌ వేయడం విషయమై పక్కనే ఉన్న ప్రభావానికి గురయ్యే వ్యక్తి మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. మున్సిపల్‌ సిబ్బంది రెండుసార్లు వచ్చినప్పటికీ శ్లాబ్‌ నిర్మాణం ఆపకపోవడం పట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.

నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయితే, ముడుపులు దండుకుంటున్న అధికారులు అక్రమార్కులపై కిమ్మనడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సెటిల్‌మెంట్లకు తెరలేపారు. జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

18వ డివిజన్‌లోని ముబారక్‌నగర్‌లో బిల్డర్స్‌ లేఅవుట్‌లో 10 శాతం భూమిని సైతం ప్లాట్లు చేస్తున్నారు. దీన్ని కాపాడేందుకు మాజీ కార్పొరేటర్‌ అనిల్‌ పోరాటం చేస్తున్నప్పటికీ మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. 45 ఎకరాల ఈ లేఅవుట్‌లో 4.5 ఎకరాలు గ్రీన్‌బెల్ట్‌ కింద వదిలారు. ఇందులో రెండున్నర ఎకరాలను గతంలో సర్పంచ్‌లు అక్రమంగా అమ్ముకున్నారు. మిగిలిన రెండెకరాల 20 గుంటల భూమిలోనే నీళ్ల ట్యాంకు కట్టారు. ఇక్కడే ఉన్న పశువుల తొట్టి, బోరుబావిని లొలగించి ప్లాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద పాఠశాల కోసం మరో నీళ్ల ట్యాంకును కట్టేందుకు స్థానికులు ప్రయత్నించగా అక్రమార్కులు మాత్రం కబ్జా చేసి ప్లాట్లు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మాజీ కార్పొరేటర్‌ అనిల్‌ ప్రయత్నిస్తుండగా అతనిపై బెదిరింపులకు దిగుతుండడం గమనార్హం. దీంతో అనిల్‌ కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ స్పందన లేదని వాపోతున్నాడు. ఈ 10 శాతం భూమిని వదిలేసేందుకు గాను స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, మొదటి విడతగా ఇప్పటికే రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆక్రమణలు.. ఉల్లంఘనలు1
1/2

ఆక్రమణలు.. ఉల్లంఘనలు

ఆక్రమణలు.. ఉల్లంఘనలు2
2/2

ఆక్రమణలు.. ఉల్లంఘనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement