గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత

Mar 22 2025 1:22 AM | Updated on Mar 22 2025 1:18 AM

రుద్రూర్‌: మండల కేంద్రంలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని గురువారం అర్ధరాత్రి బజరంగ్‌దళ్‌ నాయకులు అడ్డుకున్నారు. రెంజల్‌ మండలం సాటాపూర్‌ నుంచి రుద్రూర్‌ మీదు గా జహీరాబాద్‌ వైపు వెళ్తున్న ఐచర్‌ వాహనంలో గోవులను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వారు రుద్రూర్‌లో వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వాహనంలో ఉన్న పశువులను బోధన్‌ గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

తెయూకు అంబులెన్స్‌ అందజేత

తెయూ(డిచ్‌పల్లి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (టీజీ యూనివర్సిటీ బ్రాంచ్‌) ఆధ్వర్యంలో శుక్రవారం డీజీఎం బిజయ్‌కుమార్‌ సాహూ తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్‌ను అందజేశారు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి, ఎస్‌బీఐ ఏజీఎం మహేశ్వర్‌ కొలాటే, బ్రాంచ్‌ మేనేజర్‌ శివనారాయణ సింగ్‌, సిబ్బంది రాథోడ్‌ రవీందర్‌, రాజేష్‌, గిరిప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ మామిడాల ప్రవీణ్‌, పీఆర్‌వో పున్నయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయాగౌడ్‌, భాస్కర్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

26 నుంచి ఎడపల్లి

రైల్వేగేట్‌ మూసివేత

ఎడపల్లి(బోధన్‌): ఎడపల్లి–బోధన్‌ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వేగేట్‌ను ఈనెల 26న ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 10గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్‌ పనుల నిమిత్తంగేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. బోధన్‌, నిజామాబాద్‌ వెళ్లే వాహనదారులు సాటాపూర్‌, ఏఆర్‌పీ క్యాంప్‌, అంబం(వై) గుండా వెళ్లాలని సూచించారు.

పొగాకు దగ్ధం

బోధన్‌: రెంజల్‌ మండలంలోని బొర్గాం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులకు మంటలు ఏర్పడి రాము అనే రైతుకు చెందిన పొగాకు దగ్ధమైంది. రెండు ఎకరాలకు సంబంధించిన పంట కాలిపోవడంతో సుమారు రూ. 2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

‘అర్చరీ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా’

చైర్మన్‌గా ఈగ సంజీవరెడ్డి

నిజామాబాద్‌ నాగారం: అర్చరీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏతిక్స్‌, డిసిప్లేన్‌ చైర్మన్‌గా జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అర్చరీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రాష్ట్ర అర్చరీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంజీవరెడ్డి ఎన్నికపై జిల్లాలోని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత
1
1/2

గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత

గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత
2
2/2

గోవులను తరలిస్తున్న వాహనం అడ్డగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement