ధర్పల్లి: బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలు 11 శాతం రిజర్వేషన్ కోరగా 9 శాతం అమలు చేసి వారికి అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కర్క గంగారెడ్డి, చిలుక మహేశ్, నరేశ్ గౌడ్, రాము, మురళి గౌడ్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


