రాష్ట్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
లగేజీ తీసుకొని
ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిని
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు పరీక్ష రాసిన అనంతరం కేంద్రాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ సందడి చేశారు. హాస్టల్ విద్యార్థులు తమ లగేజ్‌లు పట్టుకొని ఇంటిబాట పట్టారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
అసెంబ్లీలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వచ్చింది. అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్ అంటూ కొందరు సమర్థించగా, విద్యారంగంతోపాటు బీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో మొండి చేయి చూపినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బడ్జెట్ అంకెల గారడీ
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి. నిజాం షుగర్, సారంగపూర్ చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ, పసుపు శుద్ధి కార్మాగారాన్ని నిర్మించేందుకు నిధులను కేటాయించలేదు. నగరాభివృద్ధికి నిధులివ్వలేదు.
– రమేశ్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
క్రీడా రంగానికి పెద్దపీట
నిజామాబాద్‌నాగారం: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడారంగానికి పెద్దపీట వేసింది. రూ. 465 కోట్లు కేటాయించడం హర్షణీయం. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఎనిమిది లైన్‌లతో స్టేడియం నిర్మాణం జరుగుతుంది.
– సయ్యద్ ఖైసర్, జాతీయ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్టు, కాంగ్రెస్ నాయకులు
విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు
ఇంటిబాట
ఇంటిబాట
ఇంటిబాట
ఇంటిబాట
ఇంటిబాట
ఇంటిబాట