నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతని స్తూ ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో పెట్టవద్దని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరం(కలెక్టరేట్)లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పా టు, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్‌లకు విన్నవిస్తూ దరఖాస్తులు అందజేశారు. కాగా, అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్య లను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు.