సుభాష్‌నగర్: పసుపు ధర విషయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. ధర తగ్గితే పదేళ్లు అధికారంలో ఉండి అప్పుడు మాట్లాడలేదని, ఇప్పుడు ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డును సోమవారం ఆయన సందర్శించారు. అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రూ.6వేలకు మించి ధర రాలేదని, ఆ సమయంలో ప్రశాంత్‌రెడ్డి, కవిత ఏం చేశారని ప్రశ్నించారు. ధర విషయమై ఎంపీ అర్వింద్ చొరవ తీసుకుని కేంద్ర మంత్రులతో మాట్లాడాలని, ధర నిలకడగా ఉండేలా చూడాలన్నారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, పసుపునకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉందని, ఇటీవల కేంద్ర మంత్రులకు లేఖలు రాశానని తెలిపారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెటింగ్‌శాఖ డీడీ మల్లేశం, డీఎంవో గంగుతోపాటు పసుపు రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. పసుపు ధర తగ్గడం, నిలకడ లేకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం పర్యవేక్షించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్ వల్లే ధరల్లో వ్యత్యాసం ఉందని వ్యాపారులు చెప్పగా, రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణంతోపాటు సాంగ్లీ, ఈ–రోడ్ మార్కెట్లను సందర్శించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. నాయకులు ప్రభాకర్, దేవరాం, లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు అగ్గు భోజన్న, నరేందర్, రాజలింగం, మారుతి మల్లేష్ ఉన్నారు.
పసుపు ధరపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే
ప్రశాంత్‌రెడ్డివి అర్థం లేని మాటలు
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి


