నిజామాబాద్‌నాగారం: బహుజనులను రాజ్యాధికా రానికి దగ్గర చేసిన వారు కాన్షీరామ్ అని సీనియర్ న్యాయవాది ఘంటా సదానందం, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో కాన్షీరాం జయంతిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత బహు జనుల రాజ్యాధికారం కోసం తన జీవితాంతం నిరంతరం పోరాటం చేసి యూపీలో తన కన్న కలలు దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికా రాన్ని అందించడం జరిగిందన్నారు. నేడు యూపీ తర్వాత ఏపీ అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌లో దళితుల రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేసిన కృషివలుడు మాన్యశ్రీ కాన్షీరాం అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మదాలె అజయ్, బత్తుల కిష్టయ్య, సాయినాథ్ గైక్వాడ్, షేక్ మిరాజ్, లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.