భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
కామారెడ్డి క్రైం: లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కోర్టులో కేసు ట్రయల్‌కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ ‘భరోసా సెంటర్‘ అండగా నిలుస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి లోని వడ్లూర్ రోడ్డులో ఉన్న భరోసా సెంటర్‌ను ఎస్పీ శనివారం సందర్శించారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు, సమావేశ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో బాధిత మహిళలకు వైద్య, సైకాలజీ, పోలీసులు సహకారం, పరిహారం ఇప్పించడం లాంటి సేవలు అందుతున్నాయని తెలిపారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించాలని, అవసరం ఉన్న వారికి భరోసా సెంటర్‌లో ఆశ్రయం కల్పించాలని సిబ్బందికి సూచించారు.


