ఇసుక డంపులు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక డంపులు సీజ్‌

Mar 15 2025 1:56 AM | Updated on Mar 15 2025 1:54 AM

నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని తల్వేద గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను స్థానిక పోలీసులు శుక్రవారం సీజ్‌ చేశారు. అంతకుముందు తల్వేద గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం గ్రామంలో నిల్వ ఉంచిన సుమారు 20 ట్రిప్పుల ఇసుక డంపులను రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్‌ చేశారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ సురేష్‌తోపాటు ట్రాక్టర్‌ యజమాని సంటోళ్ల సాయరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

అదుపుతప్పి బ్రిడ్జి కిందకు దూసుకెళ్లిన కారు

భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఉన్న టోల్‌గేట్‌ను తప్పించుకునేందుకు దారిని మార్చుకుని వెళ్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. వివరాలు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం కారులో బాసరకు బయలుదేరారు. భిక్కనూరు వద్ద టోల్‌ తప్పించుకునేందుకు జాతీయ రహదారిని వదిలి భిక్కనూరు వచ్చి అంతంపల్లి మీదుగా వెళ్లారు. ఈక్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి కిందికి వెళ్లింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో వారు డయల్‌ 100కు సమాచారం అందించారు. వెంటనే భిక్కనూరు పోలీసులు, ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పైకి తీసుకవచ్చారు. టోల్‌ తప్పించుకునేందుకు ఇలా అడ్డదారిలో వెళ్లడంపై అధికారులు వారిని మందలించారు. అనంతరం సదరు కుటుంబం అదే కారులో బాసరకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement