సుభాష్‌నగర్: నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వచ్చే ఆదివారం ఏ అంశంపైన అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సవాల్‌పై చర్చకు ఏ ఇటుకబట్టీకి రావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అర్వింద్ రెండు నవోదయలను మంజూరు చేయించారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అర్వింద్ కృషి చేస్తున్నారని, ఆయన ఆదరణను ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
పసుపు రైతులు, బోర్డు గురించి మాట్లాడే అర్హత భూపతిరెడ్డికి లేదని, ధర తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు, మాజీ కార్పొరేటర్లు న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, అంబదాస్‌రావు, ప్రమోద్‌కుమార్, బద్దం కిషన్, గంగాధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చర్చకు ఏ ఇటుకబట్టీకి రావాలో చెప్పాలి
ఎంపీ అర్వింద్ ఆదరణను
ఓర్వలేక విమర్శలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి


