ఆర్మూర్‌టౌన్: షార్ట్‌సర్క్యూట్‌తో మూడు షాపులు దగ్ధమైన ఘటన పెర్కిట్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెర్కిట్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కిరాణషాప్, ఆటోమొబైల్‌షాప్, హోటల్ దుకాణాల నుంచి ఉదయం పొగలు వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మూడు దుకాణాల్లో ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. జిల్లా అగ్నిమాపక అధికారి పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి మధుసూదన్ రెడ్డి, ఆర్మూర్ పోలీసులు, రెవన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. 24 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు బాల్‌రాజ్, గోపాల్, ముగ్ధుమ్ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.


