
నారాయణస్వామి ఆలయ ఉత్సవాలు ప్రారంభం
సిరికొండ: మండల కేంద్రంలోని శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 61వ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వస్తి పుణ్యహవచనం, నవగ్రహ పూజ, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు లింబాద్రి, శ్రీనివాస్, గంగయ్య, రంజిత్, భూషణ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి సిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్ సిటీ: నగరంలోని గాయిత్రీనగర్ సిద్ధి, బుద్ధి సహిత వినాయక స్వామి ఆలయ 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మచ్చ చంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక స్వామి శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.