
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని సీఎంసీలో బుధవారం సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ సహకారంతో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలున్న వారికి అద్దాలు ఉచితంగా అందజేశారు. వైద్యశిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సందర్శించారు. గురువారం కూడా వైద్య శిబిరం కొనసాగుతుందని రోగులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వైద్యులు జేమ్స్, భక్త్‌సింగ్, వాసవి, సంధ్యారాణి, స్వరూప్ కుమార్, ఆసిఫ్, జవహర్ కెన్నడి, జయరాజ్ ఉన్నారు.

వైద్యశిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి