రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

Published Thu, Apr 18 2024 1:00 AM

మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌  - Sakshi

నిజామాబాద్‌ నాగారం: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతంగానికి రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. ఎన్నికల కోడ్‌ రాకముందు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకీ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. తాను ఎంపీగా గెలిస్తే గల్ఫ్‌ బాధితులకు అండగా ఉంటానన్నారు. ఎంపీ అర్వింద్‌ ఐదు ఏళ్లలో జిల్లాలోని ఏ గ్రామంలో పర్యటించలేదని ఆరోపించారు. ప్రజలు అర్వింద్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ఎంపీ అర్వింద్‌ జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మాధవ్‌నగర్‌ బ్రిడ్జికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.60 కోట్లు ఇస్తే కేంద్రం రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జిల్లా గురించి ఎప్పుడైన మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దని, బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 19న నామినేషన్‌ వేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరు అవుతారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, ఇందల్‌వాయి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మురళి పాల్గొన్నారు.

ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు

19న నామినేషన్‌ వేస్తా

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి

బాజిరెడ్డి గోవర్ధన్‌

 
Advertisement
 
Advertisement