కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌వి బూటకపు హామీలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌వి బూటకపు హామీలు

Published Wed, Apr 17 2024 1:15 AM

మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌ ధర్మపురి   - Sakshi

సుభాష్‌నగర్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నాయని, పదేళ్ల బీఆర్‌ఎస్‌, నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనను దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్‌ ధర్మపురి సూచించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు గ్యారంటీయే లేదని, బీజేపీ సంకల్ప పత్రానికి (ఎన్నికల మేనిఫెస్టో) ప్రధాని మోదీ గ్యారంటీ అన్నారు. మంగళవారం నగరంలోని బీజే పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుమారు 30 లక్షల మంది సలహాల మేరకే బీజేపీ సంకల్ప పత్రాన్ని విడుదల చేసిందని తెలిపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా జైలు పాలు కాక తప్పదన్నారు. ఎమ్మెల్సీ కవితను సీబీఐ, ఈడీ అరెస్ట్‌ చేశా యని ఇప్పట్లో బెయిల్‌ రావడం కష్టమేనని పేర్కొన్నారు. మహిళల హక్కులు, ఆత్మాభిమానం కోసం యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలు చేసి తీరుతామని, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలవుతుందని పేర్కొన్నారు. దేశానికి ఈ ఎన్నికలు ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దుతాం

కందకుర్తి వద్దగల త్రివేణి సంగమం, బాసర సరస్వ తి అమ్మవారి క్షేత్రం, ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ను కలుపుకుని టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నామని ఎంపీ అర్వింద్‌ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై నిఘా, పేప ర్‌ లీకేజీలపై కఠినచర్యలు ఉంటాయన్నారు. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌తో దేశానికి రూ.లక్షల కోట్లు మిగులుతాయని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండబోదన్నారు. ప్రభుత్వం జన్యూన్‌గా నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని వాల్యుయేషన్‌ వేయిస్తే.. నెల రోజుల్లో తెరిపించే బాధ్యత తనదేనన్నారు.

ఐదేళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా

ఉండటం డౌటే!

ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి

కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి అని హిందువునని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి సీఏఏ, ఎన్‌ఆర్‌ సీ, యూనిఫాం సివిల్‌ కోడ్‌పై తన స్టాండ్‌ తెలియజేయాలని అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలను బ్రిటీష్‌ వారి కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ ధ్వంసం చేసిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే కాంగ్రెస్‌లోని నాయకులు చేయనివ్వరని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే రేవంత్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండటం అనుమానమే అన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, పాట్కూరి తిరుపతిరెడ్డి, న్యాలం రాజు, పంచరెడ్డి లింగం, పద్మారెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఖైజర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement