ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Mar 14 2026 7:37 AM | Updated on Mar 14 2026 7:37 AM

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పరీక్షా కేంద్రాలు, హాస్టళ్లు, కళాశాలల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తోటి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపి సెల్ఫీలు తీసుకున్నారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో హాస్టళ్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, కుటుంబ సభ్యులతో బస్టాండ్‌ కిటకిటలాడింది.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ – నిజామాబాద్‌

సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థులు

వీసీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో వంట గ్యాస్‌ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. అమెరికా – ఇరాన్‌ యుద్ధ పరిస్థితు లను కారణంగా చూపుతూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న గ్యాస్‌ కొరత ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు. అవసరానికి మించి సిలిండర్లు బుక్‌ చేయకుండా, అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీసీలో మంత్రి తుమ్మల, సీఎస్‌ రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్‌ స్టీవెన్‌ రవీంద్ర, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ కిర ణ్‌ కుమార్‌, అడిషనల్‌ డీసీపీ బస్వారెడ్డి, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో వంట గ్యాస్‌ కొరత లేదు

Advertisement
 
Advertisement
Advertisement