బోధన్/ఆర్మూర్ టౌన్: గృహ అవసరాల (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోంలో 15, చాందినీ దాబాలో మూడు డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో డీటీ హనుమాన్, పవన్‌కుమార్, మహేశ్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వినోద్, శ్రీనివాస్ తనిఖీలు చేపట్టారు. మొత్తం 31 దుకాణాల్లో తనిఖీలు చేసి, 68 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఆర్‌ఐ ప్రమోద్, జీపీవో నితిన్ ఉన్నారు.


