నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కల్యాణ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ నేపథ్యం తెలుసుకొని తాను సంభమాశ్యర్యాలకు గురయ్యాయని మంత్రి అన్నారు. ఎలాంటి లాభపేక్ష లేకుండా ఈ ఆలయాన్ని శ్రీమాన్ నర్సింహారెడ్డి కట్టించడం చాలా గొప్ప విషయమని మంత్రి సురేఖ అన్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తిరుపతికి వెళ్లలేని వారు ఇందూరు తిరుమలలో ఆ భక్తిని, శక్తిని దక్కించు కోగలుగుతున్నారని అన్నారు. సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతరెడ్డి పాల్గొన్నారు. సినీ నిర్మాత దిల్‌రాజ్‌తో ఎమ్మెల్యే కొంతసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో దేవనాథ జీయర్ స్వామి, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి, సినీ హీరో ఆశిష్, విజయసింహారెడ్డి, రాములు, ప్రవీణ్, పృథ్వి, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, రమేశ్, భాస్కర్, నరేందర్, మురళి, యాజ్ఞాచార్యులు అనంత ఆచార్య, సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమారాచార్యులు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ిపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మోపాల్ అధ్యక్షుడు సాయి రెడ్డి, రూరల్ అధ్యక్షుడు కౌలాస్ మోహన్, నాయకులు ఉమ్మాజి నరేశ్, సడక్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘనస్వాగతం
జిల్లాకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం నర్సింగ్‌పల్లిలో నిర్వహించిన వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, నగర మాజీ మేయర్ ఆకుల సుజాత, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ కప్‌కర్ గన్‌రాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్ పాల్గొన్నారు.


