ఖలీల్‌వాడి:జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల ని ర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నె ల 14 నుంచి వచ్చే నెల 16 వరకు పరీక్షలు కొన సాగనున్నాయి.జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 12,244 మంది బాలురు, 12,155 మంది బాలికలు, మొత్తం 24,399 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఐదు నిమిషాల ఆలస్యం అయినా ఒకే..
పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగుతాయి. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం అయినా విద్యార్థులకు అనుమతి ఉంటుందని డీఈవో పార్శి అశోక్‌కుమార్ తెలిపారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.
ఈ వస్తువులకు అనుమతి లేదు
విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులెటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉండాలి. కేంద్రాల వద్ద బీఎన్‌ఎన్ 163 అమలులో ఉంటుంది. అత్యవసర సమాచారం కోసం జిల్లా విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ 90302 82993ను ఏర్పాటు చేసింది.
కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలోని పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 49, బీ కేటగిరీలో 49, సీ కేటగిరీలో 46 కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణకు 144 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 144 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1,214 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరితోపాటు ఏడుగురు అడిషనల్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్లు, 22 మంది జాయింట్ కస్టోడియన్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ నియమించారు.
నేటి నుంచి ప్రారంభం
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
పరీక్ష రాయనున్న 24,399
మంది విద్యార్థులు
144 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
హాల్ టికెట్‌తో బస్సుల్లో
ఉచిత ప్రయాణం
పాఠశాలల వారీగా పరీక్ష రాసే విద్యార్థుల వివరాలు


