ఎర్ర జొన్నల ధరలు తగ్గించడం సరైంది కాదు | - | Sakshi
Sakshi News home page

ఎర్ర జొన్నల ధరలు తగ్గించడం సరైంది కాదు

Mar 14 2026 7:37 AM | Updated on Mar 14 2026 7:37 AM

సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: ఎర్రజొన్నల ధరను తగ్గించ డం సబబు కాదని సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో వ్యాపారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తొందరపడి ఎర్రజొన్నలను విక్రయించవద్దని అన్నారు. రైతులు వ్యాపారులతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకొని విత్తనాలను నాటాలన్నారు. ఈ నెల 15 లోపు ఎర్రజొన్నలను వ్యాపారులు కొనుగోలు చేయాలని రైతులకు నష్టం జరిగే అవకాశం ఇవ్వవద్దని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ సమీపంలో చట్ట విరుద్ధంగా పసుపును కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తూకంలో కూడా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement