
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లంలో ఉ న్న ముస్లిం శ్మశాన వాటికలో గుర్తుతెలియని వ్యక్తు లు బోరుబావి ని ధ్వంసం చేశారు. కేసీంగ్ పైప్ ను సైతం పగులగొ ట్టారు. శ్మశానవాటికలో నీటిసౌకర్యం కల్పించాలని గతేడాది ముస్లింల కోరిక మేరకు ఎంపీటీసీ శ్రావణీదేవేందర్‌రెడ్డి బోరుబావి తవ్వకం పనులు చేపట్టి మోటర్ బిగించారు. అధికారులు స్పందించి బోరుబావిని ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
లింగంపేటలో చోరీ
లింగంపేట: మండ ల కేంద్రంలోని మ త్తడికిందిపల్లెలో శనివారం రాత్రి చో రీ జరిగినట్లు ఏఎ స్సై ప్రకాశ్ ఆదివా రం తెలిపారు. గ్రా మానికి చెందిన ప ద్మా నర్సింహులు కుటుంబ సభ్యుల తో కలిసి శనివారం ఉదయం వ్యవసాయ పనుల ని మిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా సాయంత్రం తిరి గి వచ్చారు. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న ఐదు తు లాల బంగారం, రూ. 20 వేలు నగదు, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై ప్రకాశ్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ఘటన స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం బృందంతో వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.