
బోల్తాపడ్డ ట్రాక్టర్
కమ్మర్‌పల్లి: వ్యవసాయ పను లు చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడి న ఘటనలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో ని చౌట్‌పల్లిలో చోటుచేసుకుంది.ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నయాగావ్ తాలుక అంతర్గావ్‌కు చెందిన తుకారాం హన్మత్ ఇబ్జిత్వర్(40) ఉపాధి నిమిత్తం ఐదేళ్ల క్రితం చౌట్‌పల్లికి వ చ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నా డు. ఆదివారం సాయంత్రం ఓ వ్యవసాయ క్షేత్రంలో వరి పంట వేయడానికి అనుగుణంగా పొలంలో ట్రాక్టర్‌తో రోటవేటర్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న ఇబ్జిత్వర్ ట్రాక్టర్ కింద పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆర్మూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

తుకారాం మృతదేహం